జ్యోతిరావు పూలే కి నివాళులర్పించిన పీతల మూర్తి యాదవ్.
విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే 194 జయంతిని పురస్కరించుకొని శని వారం ఉదయం మద్దిలపాలెం జంక్షన్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన జన సైనికుడు పీతల మూర్తి యాదవ్.బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. కుల వివక్ష నిర్మూలనకు , మహిళా సాధికారతకు, ఎనలేని సేవలందించిన జ్యోతిరావు పూలే, ఆయన సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే ల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పితాని ప్రసాద్ , సురేష్ మీనన్ , కూర్మి నాయుడు , దేవర రఘు, హస్మత్, మల్ల రవి , పోతు ప్రసాద్ , శ్యామ్ తదితరులు పాల్గొన్నారు