ఈ నెల 21 వ తేదీలోగా నవశకం పథకము పేర్లు నమోదు చేసుకోవాలి

 జివిఎంసి పరిధిలో నవశకం పథకము క్రింద గృహాల మంజూరు కొరకు అర్హత గల వ్యక్తులు పేర్లు నమోదు చేసుకోవాలి -జివిఎంసి కమిషనర్ డా.జి.సృజన 



 విశాఖపట్నం, మే 05 :- జివిఎంసి పరిధిలో నివశిస్తున్న ప్రజలు నవశకం పథకములో భాగంగా, గృహాల మంజూరు కొరకు అర్హత గల వ్యక్తుల నుండి పేర్లు నమోదు చేయమని ఇదివరకే విజ్ఞప్తి చేయగా 1,77,729 వ్యక్తులు గృహాల మంజూరు కొరకు నవశకం పథకం క్రింద పేర్లు నమోదు చేసుకొని యున్నారు. ఈ పథకం క్రింద నమోదు కాబడిన పేర్లు ఆయా వార్డులలో ప్రజలు పరిశీలించుటకు గాను పొందుపర్చియున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి ఈ పథకం క్రింద గృహాల మంజూరు కొరకు ఎవరైనా అర్హత కలిగిన వ్యక్తులు ఉ ంటే, మే 21 తేదీలోగా నవశఖం పథకము క్రింద దరఖాస్తు చేసుకొని పేరు నమోదు చేసుకోవలసినదిగా మరొకసారి అవకాశం ఇచ్చి యున్నారు. తదనుగుణంగా జివిఎంసి కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇదివరకు ఎవరైనా అర్హత ఉండి కూడా నవశకం పథకం క్రింద గృహాల మంజూరుకు దరఖాస్తు చేసుకోలేని వారు, మరీ ముఖ్యంగా ఇంతకు పూర్వము, గృహాల మంజూరు చేస్తూ ఎంపిక చేసిన లబ్దిదారులు ఎవ్వరైనా ఇదివరకు నవశకంలో పేర్లు నమోదు చేసుకోకపోతే ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం ఈ నెల 21 వ తేదీలోగా ఆయా వార్డు సచివాలయాల నుండి దరఖాస్తులను పొంది, నవశకం పథకం క్రింద పేర్లు నమోదు చేసుకోవలసినదిగా కమిషనర్ ఒక ప్రకటనలో నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.