260 దుకాణాలలో తనిఖీలు 71 కేసులు నమోదు కలెక్టర్ వి.వినయ్ చంద

జిల్లాలో నిబంధనలు పాటించని దుకాణాలపై 71 కేసులు నమోదు - జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద


విశాఖపట్నం, మే 01: జిల్లా వ్యాప్తంగా 25 తనిఖీ బృందాలు నిత్యావసర సరుకుల ధరలు, తూనికలపై ఈ రోజు 260 దుకాణాలలో తనిఖీలు నిర్వహించి నిత్యావసర సరుకుల ధరలు, తూనికలు, నిభంధనలు పాటించని దుకాణాలపై 71 కేసులు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు వరకు 3089 దుకాణాలను తనిఖీ చేసి 949 కేసులు నమోదు చేశామన్నారు. తూనికలు కొలతలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల వారు 102 షాపులు తనిఖీ చేసి 15 కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ 56 కేసులను నమోదు చేయగా జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో 158 షాపులను తనిఖీ చేశారని చెప్పారు. ఈ తనిఖీలలో జిల్లా అధికారులు, తహసిల్దార్లు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు. సరుకులను నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా అమ్మితే టోల్ ఫ్రీ 1902 మరియు 18004250 0002 నంబర్లకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.