అర్ధరాత్రి సమయంలో మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన విషవాయు
విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో కంపెనీలో భారీ ప్రమాదం ఇద్దరు మృతి
ప్రమాదం పై ఆరాతీసిన సీఎం జగన్
విశాఖ రానున్న జగన్
విశాఖపట్నం మే 07 వారధి న్యూస్ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విస వాయవు గాల్లో వ్యాపించిన తో 9 మంది చెందినట్లు అధికారకం గా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అర్ధరాత్రి సమయంలో మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన విషవాయు తో ఐదు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు కళ్ళు మంటలు కడుపునొప్పి లతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మూడు కిలోమీటర్ల మేర విస్తరించిన విషవాయువులు అర్ధరాత్రి సమయంలో లీకైనఎల్జి గ్యాస్ తో ఇల్లు వదిలి మేఘాద్రి గడ్డ వైపు పరుగులు తీసారు ఎల్జీ పాలిమర్ కంపిని పరిసర ప్రాతం లో ఉన్న ఆర్ వెంకటాపురం గ్రామస్తులను ఖాళి రెండు వేళా మంది ప్రజలు అస్వస్థకు గురి అయినట్లు తెలుస్తోంది అయితే ఉదయం 7 గంటలవరకు అదుపులోకి రాని పరిస్థితి అస్వస్థతకుగురైన వందలాది మంది బాధితులను విశాఖపట్నం కేజీహెచ్ తో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు ఎల్జీ పాలిమర్ కంపిని సంఘటనతో అప్రమత్తం ఆయన జిల్లా యంత్రాంగం ఫోన్లో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జిల్లా కలెక్టర్ వినయ్ చందు తో ఫోన్లో మాట్లాడిఅస్వస్థతకు గురైన ప్రజలు వెంటనే ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పరిస్థిని సమీక్షచినజిల్లా కలెక్టర్ వినయ్ చందుఅపస్మారక స్థితి లో ఉన్నవారిని దగ్గరుండి అంబులెన్స్లో ఆటోలు కార్లు ఆసుపత్రిలకు తరలించారు
ఘటనస్థలంలోఒకవ్యక్తికళ్ళుమంటలతోదారితెలియకబావిలో పడి మృతి చెందాడు పలు ముగా జీవాలు మృత్యువాత పడ్డాయి గ్యాస్ లీక్ కావడం తో చెట్లు వాడిపోయాయి ఫ్యాక్టరీ నుంచి ప్రస్తుతానికి గ్యాస్ లీకు ఉదయం 8:30 గంటల సమయంలో అగినట్లు అధికారులు నిర్ధారించారు జిల్లా కలెక్టర్ వినయ్ చందు సంఘటన స్థలానికి ముందుగా ఆర్డిఓ నీ పోలీసు యంత్రాంగాన్ని పంపించారు వెంటనే జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ మీనాతో కలిసి వెంకటాపురం ప్రాంతానికి వెళ్లారు అక్కడ పరిస్థితిని చూసి ఆగమేఘాలమీద సింహాచలం డిపో నుండి బస్సులు తెప్పించాలనిఅధికారులకు ఆదేశాలు జారీ చేశారు అపస్మారక స్థితి లో ఉన్నవారిని బస్సులలో వారందరినీ వైజాగ్ కేజీహెచ్ కు తరలించారుఅయితే ప్రస్తుతానికి ఎంత మంది ఈ ప్రమాదంలో మరణిస్తారో చెప్పడం కష్టం అంటున్న అధికారులు వేవుకా జామున నాలుగు నుంచి వీధుల్లో ఉన్నటువంటి డిఎస్పి ఉదయభాస్కర్ కూడా కాస్త అస్వస్థతకు గురయ్యారుమొత్తం ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరుండి ప్రజలను అధికారులను అప్రమత్తం చేస్తూన్నారు
అలాగే స్థానిక ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నం పరిసర ప్రాంతాల వైపు ఎవరు రావద్దని ట్విట్టర్ వేదికగా వేడుకొన్నారు ఇక విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయప్రసాద్ ఆ ప్రాంతానికి చేరుకుని విషయాన్ని తెలుసుకున్నారు డాక్టర్లు మాత్రం బాధాకరమైన పరిస్థితి ఉందని చెబుతున్నారు ఇదిలా ఉంటే ప్రతి ఇంటిని లోపలకు వెళ్లి మనుషులు ఉన్నారా లేదా అని పోలీసులు రెవెన్యూ శాఖ పరిశీలన చేస్తు ఎవరైనా ఉంటే వారికి తక్షణమే ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, అయితే గత నలభై రెండు రోజులుగా ఫ్యాక్టరీ మూతపడి ఒక్కసారి తీసి యంత్రాలను ఆపరేట్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు అయితే గ్యాస్ లీక్ కావడం తో ఊపిరాడక చాలా మంది అస్వస్థతకు గురయ్యారని వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించడం తో కొంత ప్రమాదం తప్పిందని జిల్లా కలెక్టర్ వినయ్ చందు తెలిపారు