విశాఖపట్నం: వారధి న్యూస్ మే 30-పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనతసీఎం జగన్ కె దక్కుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు అన్నారు ఏడాది పాలనలో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం తొలి ఏడాదిలోనే నెరవేర్చిన ఘనత సీఎం కి దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు మంత్రి అవంతి పూల మాలలు వేసి నివాళర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు గరికిన గౌరి, కొయ్యా ప్రసాద రెడ్డి, శ్రీధర్రెడ్డి, కోలా గురువులు నార్త్ ఇన్ ఛార్జి కెకె రాజు, మాజీ ఎమ్మెల్యేలు రెహమాన్, కుంభా రవిబాబు, పాల్గొన్నారు