ఎల్జీ పాలిమర్స్ కంపినీ శాస్వితంగా మూతవేయాలి..సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి.

ఎల్జీ ఘటనలో గ్యాస్ తరలింపులో అనుమానం...
 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి.


విశాఖపట్నం :వారధి న్యూస్ మే 12-ఎల్జీ పాలిమర్స్ ఘటనకు బాద్యులైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి కంపెనీ శాశ్వితంగా మూసివేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.ఎల్జీ పాలిమర్స్ ఘటనను నిరసిస్తూ మంగళవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం వెనకనున్న వారిపై కేసులు పెట్టి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఘటనకు గల కారణాలు వెలికి తీయాల్సిన తరుణంలో అక్కడి నుండీ గ్యాస్ నిల్వలను ఇతర దేశాలకు తరలించడం వెనుక అనుమానాలు వెలుబడుతున్నాయని అన్నారు. అక్కడి పరిస్థులను చక్కదిద్ది స్థానిక గ్రామస్థులకు ధైర్యం నెలకొల్పాల్సింది పోయి ఏదో ఆడవిడి చేస్తూ మంత్రులు, అధికారులు పబ్బం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర ప్రాంతాల్లోని నమూనాలను సేకరించి పరిశోధనలు చేయాలని, నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.గ్రామస్థులకు న్యాయం చేయాలని మేము వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తే మాపై కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళన కారులను రిమాండ్ కు తరలంచాలని మేజిస్ట్రేట్ ముందు ప్రవేశ పెట్టేందుకు పోలీసులు అనుమతి కోరగా... వారిపై కేసులు పెట్టడం ఏమిటని మేజిస్ట్రేట్ వారిని ప్రశ్నించారు అంటే వీరి చర్యలు ఏవిదంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.కంపెనీ శాశ్వితంగా మూసే వరకు తమ పోరాటం దశల వారిగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
    కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎమ్ పైడిరాజు,కార్యవర్గ సభ్యులు జి వామన మూర్తి, ఈశ్వర రావు, నాయకులు కాసుల రెడ్డి,మన్మధ రావు నందన్న, చంద్రశేఖర్, తిరుపతి రావు, శివప్రసాద్,వజ్రం తదితరులు పాల్గొన్నారు.