ముంబయిలోని జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరవరావు

వరవరరావుకు అస్వస్థత ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు.


ముంబై మే 30  విరసం నాయకులు వరవరరావు ముంబయిలోని జేజే ఆసుపత్రిలో  చేరారు. ఏడాదిన్నరగా జైల్లో ఉన్న 80 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆయన్ను జేజే ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది.పుణె పోలీసులు ఆయన్ను ఆసుపత్రిలో చేర్చిన విషయాన్ని హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వరవరరావు భార్య హేమలతకు సమాచారం ఇచ్చారు. . శుక్రవారం సాయంత్రానికి ఆయన విషమ స్థితి నుంచి బయటపడ్డారని తెలిసినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.వరవరరావు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మూడు రోజులుగా ఆయన మహారాష్ట్రలోని తలోజా జైలు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.గురువారం జైలు ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ముంబయిలోని జేజే ఆసుపత్రికి ఆయన్ను తరలించినట్టు తమకు తెలిసిందని ఆయన భార్య హేమలత విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు