సుధాకర్ నుంచి వాంగ్మూలం

సుధాకర్ చికిత్స పొందుతోన్న ప్రభుత్వ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు 



విశాఖపట్నం మే 30 వారధి న్యూస్ శనివారం  డాక్టర్ సుధాకర్ చికిత్స పొందుతోన్న ప్రభుత్వ మానసిక వైద్యశాలకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం సీబీఐ బృందం సుధాకర్ నుంచి వాంగ్మూలం తీసుకునే పనిలో ఉన్నారు ఇది ఇలా ఉంటె సీబీఐ అధికారులు శుక్రవారం విశాఖ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. డాక్టర్‌ సుధాకర్‌ అభియోగాల మేరకు విశాఖపట్నంలో గుర్తుతెలియని పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరిపై 120-బీ, 324, 343, 379, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. నేరపూరిత కుట్ర, కావాలని దూషించడం, మూడు రోజులకు పైగా అక్రమ నిర్బంధం, దొంగతనం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వీరిపై విశాఖపట్నం సీబీఐ ఎస్పీ పుట్టా విమలాదిత్య కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇంకా పూర్తీ వివరాలు రావాల్సి ఉంది .మేరకు నర్సీపట్నం డాక్టర్‌ సుధాకర్‌ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ అధికారులు తీసుకున్న విషయం తెలిసిందే.