మత్స్యకార కుటుంబాలకు సరుకుల పంపిణీ

మత్స్యకార కుటుంబాల ఆకలి తీర్చడమే నా లక్ష్యం యం వి వి  సత్యనారాయణ



విశాఖపట్నం మే 03  పార్లమెంట్ సభ్యులు శ్రీ యం వి వి  సత్యనారాయణ  సొంత నిధులతో కరోనా లాక్డౌన్ కారణంగా మత్స్యకార కుటుంబాల ఆకలి తీర్చడానికి తూర్పు నియోజకవర్గంలో ఉన్న  మత్స్యకార కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి 5 kg ల బియ్యం, 4 గుడ్లు పార్లమెంటు సభ్యులు శ్రీ యం వి వి సత్యనారాయణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.ప్రతీ వ్యక్తి దూరం పాటించి ఈ కరోన ని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, విశాఖపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ అల్లంపల్లి రాజుబాబు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, సీనియర్ నాయకులు ఆధిశేషయ్య గారు, రాష్ట్ర అదనపు కార్యదర్శి పేర్ల విజయచంద్ర పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.