ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు రూ లక్ష విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి పూర్వవిద్యార్థుల విరాళం వీసీ ప్రసాద రెడ్డి


విశాఖపట్నం మే 01 ఆంధ్రవిశ్వవిద్యాలయం విశాఖపట్నం ముఖ్యమంత్రి సహాయనిధికి పూర్వవిద్యార్థుల విరాళం వీసీ ప్రసాద రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు రూ లక్ష విరాళంగా అందించారు. ఈ రోజు ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డికి విరాళాన్ని అందించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి తమవొంతు సహకారాన్ని అందించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎం. విశ్వేస్వర రావు, ఆచార్య పి.మల్లికార్జున రావు, ఆచార్య జి.వి.ఆర్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి డైట్ కళాశాల రూ లక్ష విరాళంగా అందించింది. ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ కు కళాశాల ప్రతనిధులు నిధుల చెక్ ను అందించారు.