పేదవాడికి కరంట్ షాక్

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ ముగిసేంత వరకు గృహ వినియోగ విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి.


లాక్ డౌన్ తొలగించిన తరువాత మూడు నెలలపాటు పాత శ్లాబ్ ల  ప్రకారమే విద్యుత్ బిల్లులు వసూలు చేయాలి


విశాఖ[పట్నం మే 12 వారధి న్యూస్ లాక్ డౌన్ తొలగించిన తరువాత మూడు నెలలపాటు పాత శ్లాబ్ ల  ప్రకారమే విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని ,కరోనా కారణంగా ఎటువంటి ఆదాయం, జీతాలు  లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని మోపడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వైఖరిని తెలియజేస్తుందని జనసైనికుడు పీతల మూర్తి యాదవ్ అన్నారు  ఈపిడిసిఎల్ చైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్నుమంగళవారం ఉదయం  వినతిపత్రాన్ని అందజేసారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాతూసాధారణ విద్యుత్  బిల్లుల స్థానంలో పెంచిన శ్లాబ్ తో కూడిన బిల్లులను, మారిన శ్లాబు లతో కూడిన బిల్లులను పంపించడం ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థ లు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయని. నాలుగు వేల రూపాయల ఇంటి అద్దె చెల్లించే వారికి ఆరు వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చిందని , అసలే ఆదాయం లేక అష్టకష్టాలు పడుతున్న సమయంలో కరెంట్ బిల్లులు అధికం మొత్తం లో రావడం ప్రజలను తీవ్ర వేదనకు గురిచేస్తుందని ,భారీగా పెరిగిన విద్యుత్ చార్జీల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు . ఈ వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే కరోనా కారణంగా విధించిన లాక్  డౌన్ సమయంలో విద్యుత్ ను ఉచితంగా అందించాలనిపీతల మూర్తి మూర్తి యాదవ్ కోరారు