రేషన్ డిపో సిబ్బంది విధిగా మాస్క్ లు ధరించాలి

• రేషన్ డిపోలకు మాస్కు లు, శానిటైజర్లు పంపిణీ • రేషన్ డిపో సిబ్బంది విధిగా మాస్క్ లు ధరించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్



విశాఖపట్నం,మే, 1  రేషన్ డిపోలకు మాస్కు లు, శానిటైజర్లు పంపిణీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని వివిధ రేషన్ డిపోలను ఆయన సందర్శించారు. నగరంలో రెడ్ జోన్ ఏరియాలో గల 2వ రేషన్ షాపును సందర్శించి ఇంటింటి రేషన్ విడుదల కార్యక్రమం జరుగుతున్నది లేదని ఆయన స్వయంగా సందర్శించి లబ్దిదారులకు ఆయనే స్వయంగా శానిటైజర్ వేసి రేషన్ తీసుకోవడానికి ఆయన పంపిస్తున్నారు. జిల్లాలోని రేషన్ షాపులకు 19 వేల 900 శానిటైజర్లు 100 ఎం.ఎల్., 19 వేల 900 మాస్క్ లు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వాటిని రేషన్ షాపుల వద్ద సక్రమంగా వినియోగిస్తున్నది 19 వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. అక్కడ నుండి శ్రీనగర్ లో గల షాపు నంబరు 25, రాంనగర్ లో గల షాపునంబరు 170 లను ఆయన సందర్శించి లబ్దిదారులకు పలు సూచనలు జారీ చేశారు. రేషన్ తూకులో ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాలన్నారు. అక్కడ నుండి బయలుదేరి గాజువాకలోని షాపు నంబరు 592 కుంచుమాంబ కాలనీలో రెడ్ జోన్ ఏరియాలో ఇంటింట రేషన్ పంపిణీ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ములగాడలోని 286, 290 నంబరు గల షాపులను ఆయన సందర్శించి రేషన్ తీసుకోవడానికి అందరూ గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి నిర్మలాభాయ్, జోనల్ కమీషనర్, గాజువాక తహసిల్దార్, ములగాడ తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.