ఆరెంజ్ జోన్ లోనే విశాఖపట్నం జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్

https://youtu.be/AOpT1VvU-mw


 


విశాఖ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్


*ఆరెంజ్ జోన్ లోనే విశాఖపట్నం జిల్లా
*కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జిల్లాలో కూడా అమలు
**జిల్లా జోన్ పై పది రోజుల తర్వాత పునః సమీక్ష
కంటోన్మెంట్ జోన్ పరిధి తగ్గుదల - ఆంక్షలు పక్కాగా అమలు*
*వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి
*వృద్ధులు గర్భిణులు పిల్లలు బయటకు రావద్దు
*కాలనీలో ఉన్న చిన్న షాపులు తెరవవచ్చు
*వలస కార్మికులు, కూలీలు, చిక్కుకుపోయిన *విద్యార్థులు, యాత్రీకులకు అనుమతి
*జిల్లాలో 144 సెక్షన్ అమలు 



విశాఖపట్నం, మే 3: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ విశాఖ జిల్లా లో కూడా రెండు వారాలు కొనసాగుతుందని జిల్లా కలెక్టరు తెలిపారు. ఆదివారం చిల్డ్రన్స్ ఎరీనా లో ఆయన పోలీసు కమిషనర్ ఆర్.కె. మీనా, ఎస్పీ అట్టాడ బాపూజీ లతో కలిసి జిల్లాలో లాక్ డౌన్ పై విలేకరుల సమావేశం నిర్వహించారు. విశాఖ నగరపాలక సంస్థ ను ఒక యూనిట్ గా, మిగిలిన జిల్లాను రెండవ యూనిట్ గా పరిగణించి నట్లు చెప్పారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి 21 రోజులు పాజిటివ్ కేసు లేనట్లయితే గ్రీన్ జోన్ అయి వుండేదని ఉంటుందన్నారు. ఆ ప్రకారంగా లో జిల్లాలో నగరంలో పాజిటివ్ కేసులు వచ్చినందున జిల్లా పునః సమీక్షకు మరో పది రోజులు పడుతుందన్నారు. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న నిబంధనలే కొనసాగుతాయన్నారు. బస్సు రైలు విమాన మార్గాల ను అనుమతించరని అంతర్ రాష్ట్రీయ అంతర్ జిల్లాల ప్రయాణాలకు వీలుపడదు అన్నారు. అయితే వైద్యపరమైన కారణాలపై రవాణాను అనుమతిస్తారని తెలిపారు. విద్యా సంస్థలు తెరుచుకోవని, ఆన్లైన్ బోధన, కోచింగ్ లకు అనుమతి ఉంటుందన్నారు. హోటల్లు సినిమా హాలు షాపింగ్ మాల్స్ మొదలైన వాటికి అనుమతి లేదని, సాంఘిక రాజకీయ మత సంబంధమైన సమావేశాలు లేక కూటములకు అనుమతి ఉండదన్నారు. ప్రార్థనాలయాలు అన్నీ మూసే ఉంటాయన్నారు. రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు బయటకు అనుమతి ఉండదని చెప్పారు. కుటుంబంలోని ఒకరు మాత్రమే బయటకు వచ్చి సరకులు తీసుకు వెళ్లవలసిందిగా కోరారు. వృద్ధులు గర్భిణీ లు పూర్తిగా ఇళ్ల కే పరిమితం అవ్వాలి అన్నారు.


కంటోన్మెంట్ జోన్ పరిధి తగ్గి 
ఆంక్షలు పక్కాగా అమలు


రెడ్ జోన్ ల పరిధిని కుదించి, నిబంధనలు కఠినంగా అమలు చేస్తారని చెప్పారు. రెడ్ జోన్ పరిధిలో 3 కి.మీ నుండి 500 మీటర్ల కు, ఆపై బఫర్ జోన్ 2 కి.మీ నుండి 2.5 కి.మీ లకు మార్చడం జరిగింది అన్నారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, వ్యాపించిన కేసులను అనుసరించి ఈ మార్పులు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో 34 పాజిటివ్ కేసులు ఉన్నాయని, జోన్లలో ఎక్కడా మార్పు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. నగరంలో అల్లిపురం, ఐటిఐ జంక్షన్, ముస్లిం తాటిచెట్లపాలెం, ఎన్ఏడి దగ్గర శాంతినగర్, రైల్వే న్యూ కాలనీ, వన్ టౌన్ లోని రంగిరీజ్ వీధి, గాజువాక కుంచు మాంబ వీధి, మాధవధార, చెంగలరావు పేట, గోపాలపట్నం, మర్రిపాలెం కాగా పద్మనాభం మండలం రేవిడి, నర్సీపట్నంలో కోమటి వీధి, కశింకోట దగ్గర చింతలపాలెం 15 డోన్ లోగా కొనసాగుతున్నాయని వివరించారు.


ప్రస్తుతం మన జిల్లాలో కరోనా కీలక దశలో ఉందని వచ్చే 15 రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు కుటుంబానికి ఒకరు మాత్రమే వెళ్లాలని వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని మోచేతి వరకు నురగ వచ్చే సబ్బుతో శుభ్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాస్కులు ఎల్లప్పుడూ ధరించాలని అన్ని చోట్ల సామాజిక దూరం పాటించాలని కోరారు. ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలకు చెందిన వలస కార్మికులు జిల్లా లో ఉన్నారని ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వాళ్ళు ఎక్కువగానూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల వారు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వారు ఉన్నట్టు తెలిపారు. వీరిని వారి రాష్ట్రాలకు ఇతర జిల్లాల వారిని వారి సొంత జిల్లాలకు పంపించేందుకు, అలాగే ఇతర రాష్ట్రాల్లో జిల్లాలో ఉన్న మన జిల్లా వారిని తీసుకువచ్చేందుకు జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఇప్పటికే జారీచేసిన అన్ని రకాల కోవిడ్-19 పాసులు పదిహేను రోజులు కూడా కొనసాగుతాయని తెలిపారు.
నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా మాట్లాడుతూ ప్రతి దుకాణంలో అమ్మేవారు గ్లౌజులు మాస్కులు ధరించాలని, శానిటైజర్ ఉంచాలని, భౌతిక దూరాన్ని పాటించే లా చూడాలని చెప్పారు. మార్నింగ్ వాక్ , బీచ్ విహారం నిషేధమన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లేవారికి పాసులు ఇస్తామని, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికి రాష్ట్ర డిజిపి ద్వారా అనుమతి పత్రాలు ఇప్పిస్తామని చెప్పారు. ఎవరైనా చనిపోయినా లేదా వైద్య సంబంధమైన కారణాల కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ అట్టాడ  బాపూజీ మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని నలుగురు కంటే ఎక్కువ ఒకచోట ఉండరాదని చెప్పారు. దుకాణాల వద్ద పరిశ్రమల్లోనూ భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, అది యాజమాన్యం దుకాణదారు బాధ్యతగా పరిగణిస్తామని చెప్పారు.