ఎల్ జీ  పాలిమార్స్ లో  జరిగిన ఘోర ప్రమాదంపై పలు అనుమానాలు, పీతల మూర్తి యాదవ్

గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి సందేహాస్పదంగా ఉంది  పీతల మూర్తి యాదవ్


విశాఖపట్నం మే 10 విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురం ఎల్ జీ  పాలిమార్స్ లో  జరిగిన ఘోర ప్రమాదంపై పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతు న్నాయని   జన సైనికుడు పీతల మూర్తి యాదవ్ వ్యక్తం చేశారు 12 మంది ప్రాణాలు తీసి వందలాది మందిని ఆసుపత్రి పాల్జేసిన ఈ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు . ప్రభుత్వ చర్యల పై నమ్మకం  లేని ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారన్నారు  వాస్తవ పరిస్థితులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు, అమలులో ఉన్న చట్టాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే ఈ ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి చట్ట ప్రకారం అరెస్టు చేయాలని డిమాండు చేశారు . బాధితులను గుర్తించకుండా సంస్థపై మొక్కుబడి కేసులను బనాయించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు వందలాది మంది ప్రజల ప్రాణాలతో ,ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఎల్జీ పాలిమర్్స   నుంచి లీక్ అయిన గ్యాస్ పై ఇప్పటికైనా సంస్థ యాజమాన్యం సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు  .ప్రభుత్వం ప్రకటించిన నగదు సాయంతో సరిపెట్టకుండా దీర్ఘకాలం శాశ్విత సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత గ్రామాల్లో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ప్రారంభం కాకపోవటం అక్కడ వారిలో ఆగ్రహాన్ని పెంచుతోంది అన్నారు . ప్రభుత్వ శాఖల తక్షణమే స్పందించి విషవాయువు పీల్చిన ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు . ఇందుకోసం ఆయా గ్రామాల్లోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు . ఐదు గ్రామాల్లో  ప్రజలు ఇళ్లలోని నిత్యవసర వస్తువులను వినియోగించ వద్దనే మంత్రులు చెప్పినందున వారికి కొత్తగా నిత్యవసర వస్తువులను ప్రభుత్వమే పంపిణీ చేసేవిధం గా మంత్రులు చొరవ తీసుకోవాలని జన సైనికుడు పీతల మూర్తి యాదవ్  అన్నారు