మద్యం షాప్ తెరవడం పై మహిళలు ఆగ్రహం
మద్యం షాప్ తెరచి చూడు మాసత్తా చూపిస్తాం .విశాఖ మహిళలు
విశాఖపట్నం మే 05 ఆరిలోవ తోట గురువు ప్రాంతాలలో మంగళ వారం ఉదయం మహిళలు మద్యం షాపుల వద్దకు చేరుకొని షాపులో తెరిస్తే మా తడాఖా చూపిస్తాం అంటూ నినాదాలు చేశారు 40 రోజులుగా కరోనా వైరస్ వ్యాధి ప్రబలకుండా ఇంటి వద్దనే ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న మద్యం షాపులు తెరవడంతో ఇలాంటి ప్రక్రియలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షాపులు తెరవడంతో ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు విశాఖపట్నం తోట గురువు ప్రాంతంలో పలువురు మహిళలు మద్యం దుకాణాల వద్దకు చేరుకొని మద్యం షాపులు తెరవడం వద్దని నినాదాలు చేశారు ప్రభుత్వాలు మద్యం షాపులు తెరవడం దారుణమన్నారు . ప్రజలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మహిళల దుయ్యబట్టారు ప్రభుత్వం ఐదు కేజీల బియ్యము వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోతుందా అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మహిళలు .మా ప్రాంతంలో వైన్ షాపులు తెరిస్తే ప్రభుత్వానికి ఎలా బుద్ధి తమకు తెలుసు అంటున్న విశాఖ మహిళలు ఏది ఏమైనా మద్యం షాపులు తెరవడం పై ప్రభుత్వం మరోసారి పునరావృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నా విశాఖ వాసులు. ప్రభుత్వాలు మద్యం షాపుల పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది