దేశంలోనే మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్

11 జిల్లాల్లో టెస్టింగ్‌ సౌకర్యాలు, ట్రూనాట్‌ కిట్లు ఆస్పత్రుల్లో ఉన్నాయి సీఎం జగన్ 


https://youtu.be/S8FYOUdOr_A



 


 


అమరావతి: మే 06  కరోనా (కోవిడ్‌-19) నిర్ధారణ టెస్టులపరంగా చూస్తే మనం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. . ఈ సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి పదిలక్షల జనాభాకు 2500కిపైగా కరోనా టెస్టులు చేస్తున్నామని ఇది ఒక రికార్డు అని అన్నారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో టెస్టింగ్‌ సౌకర్యాలు, ట్రూనాట్‌ కిట్లు కూడా అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు సుమారుగా 35 రోజుల కింద మనకు స్విమ్స్‌ తప్ప మరో చోట టెస్టింగ్‌ సౌకర్యం లేదని, అది కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని సీఎం జగన్‌ వివరించారు.అందరం కలిసి ఈ మౌలిక సదుపాయాలను అభివృద్ధి కృషి  చేయాలన్నారు