మృతి చెందిన కుటుంబాలకు కోటి నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్

వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు


రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష


ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు


మృతి చెందిన కుటుంబాలకు కోటి నష్టపరిహారం ప్రకటించిన సీఎం జగన్ 


 


విశాఖపట్నం మే 07 వారధిన్యూస్ : ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల  నష్ట పరిహారాన్ని విశాఖపట్నం లో ప్రకటించారు. . ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిని సీఎం గురువారం మధ్యాహ్నం  పరామర్శించారు. అనంతరం ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో కేజీ హెచ్ లో సమీక్ష నిర్వహించారు ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించాం.


మృతుల కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే వెంటిలెటర్‌పై ఉన్న వాళ్లకు రూ.25లక్షలు ఇస్తామన్నారు . ఆస్పత్రుల్లో రెండు మూడు రోజులుండి చికిత్స చేయించుకున్నవారికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు  జగన్ హామీ ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు సాయం అందిస్తామన్నారు .  నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ప్రమాదం జరిగినప్పుడు అలారమ్‌ మోగాలని, కానీ అలా జరగలేదని దీని పై విచారణ చేస్తామని ప్రకటించారు .ఎల్జీ లాంటి గుర్తింపు ఉన్న సంస్థలో ఇలాంటి దుర్ఘటనలు జరగటం బాధాకరం. పస్తుతానికి ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకై తొమ్మిదిమంది మృతి చెందరాణి   200మంది అస్వస్థతకు గురయ్యారాణి సీఎం జగన్ తెలిపారు 


ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించిన తీరు పట్ల సీఎం జగన్ సంతృప్తి పొందారు ముఖ్యమంత్రి పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు  జిల్లా ఇన్ చార్జి మంత్రి  కురసాల  కన్నబాబు, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు,  మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ,  ఆర్ అండ్ బి మంత్రి దర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యన్నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు,       వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ , నగర పోలీస్ కమిషనర్ ఆర్ .కె మీనా, శాసన సభ్యులు ,ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు.