అమరావతి: జూన్ 01 బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన లేఖ రాశారు. పేద బ్రాహ్మణుల పిల్లల చదువులు, స్కాలర్షిప్లు, పెన్షన్లు తదితర అవసరాలకు నిధులు కేటాయించామని చెప్పారన్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో, యూనివర్సిటీలలో చదువుతున్న బ్రాహ్మణుల పిల్లలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని... తక్షణమే విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణుల పిల్లలకు స్కాలర్షిప్పులు, అలాగే సామాజిక పెన్షన్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.