కాపు నేస్తం పథకానికి విశాఖ జిల్లాలోనే రూ.22 కోట్లు
విశాఖపట్నం వారధి న్యూస్ జూన్ 23 వైయస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే రూ.22 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేశామని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వైయస్ఆర్ కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవంలో జిల్లా ఇంఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు లబ్ధిదారులైన కాపు మహిళలకు చెక్కులు అందించారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపులలోని ఎంతోమంది నిరుపేదలకి ఈ పథకం ద్వారా మేలు చేకూరుతుందన్నారు .మా ప్రభుత్వం ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ముద్రగడను సైతం ఎంతో ఇబ్బందిపెట్టి, మనోవేదనకు గురిచేసిన పరిస్థితులు చూసమని తెలిపారు సీఎం శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు తొలి ఏడాదిలోనే 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చమని చెప్పారు ఆదాయ వనరులు తగ్గినా పథకాలు అమలులో ఎక్కడా వెనకడుగు వేయడం లేదన్నారు మూడు రాజధానులకు శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు .మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు