42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు

విశాఖపట్నం జూన్ 05'టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ - 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు -2020' నందు చేరుటకు అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్ధులు, ది. 05-06-2020 సాయంత్రం 05 గంటల నుండి ది. 15-06-2020 సాయంత్రం 05 గంటల వరకు bseap.org వెబ్ సైట్ ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను. అభ్యర్థులు, ది.01-06-2020 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండాలి మరియు 45 సంవత్సరములు దాటియుండరాదు. అభ్యర్ధులు, 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత కలిగియుండాలి. సాంకేతిక అర్హతలకు సంబంధించి, సంబంధిత ట్రేడ్ నందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారిచే జారీ చేయబడిన 'టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (TCC) - లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (S.B.T.E.T),ఆంధ్ర ప్రదేశ్ లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన I.T.I లచే జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హేండ్లూం వీవింగ్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండ్సస్ట్రీస్ మరియు కామర్స్ వారిచే జారీ చేయబడిన సర్టిఫికేట్స్ లేదా తెలుగు విశ్వ విద్యాలయం వారిచే జారీ చేయబడిన కర్నాటక సంగీతం నందు గాత్రం సర్టిఫికేట్స్ లేదా తత్సమానమైన సర్టిఫికేట్లు కలిగియుండవలెను. ఈ కోర్సుకు అవసరమైన అకడమిక్ సర్టిఫికేట్లు, టెక్నికల్ సర్టిఫికేట్లు మరియు అభ్యర్ధి యొక్క ఫొటో & సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయవలెను. ది.15-06-2020 సాయంత్రం 05 గంటల తరువాత ఎట్టిపరిస్థితులలోనూ ఈ కోర్సుకు ధరఖాస్తు చేసుకొనుటకు అనుమతించబడదు. 'టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ - 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు -2020' ఈ క్రింద తెలిపిన 05 కేంద్రములయందు ది. 22-06-2020 నుండి ది.02-08-2020 వరకు (42 రోజులు ) నిర్వహించబడును. 1. విశాఖపట్టణము, II. కాకినాడ, III. గుంటూరు, IV. కడప, V. అనంతపురము కావున అభ్యర్థులను ఈ సదవకాశమును ఉపయోగించుకొనవలసినదిగా కోరడమైనది.