న్యూ ఢిల్లీ జూన్ 01 దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ఆదివారం అటు దేశవ్యాప్తంగా, ఇటు తెలంగాణలోనూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా 8,380 మందికి ఈ వైరస్ సోకగా.. రాష్ట్రంలో ఏకంగా 199 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక దేశంలో మరణాల సంఖ్య 5,164కి చేరగా.. ఆదివారం ఒక్కరోజులో 193 మంది మృతిచెందారు. కేసులపరంగా భారత్ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో నిలి చింది. దేశవ్యాప్తంగా 1,82,143 కేసులు నమోదుకాగా, 89,995 యాక్టివ్ కేసులున్నాయి.