విశాఖపట్నం వారధి న్యూస్ జూన్ 06 జిల్లాలో లాక్ డౌన్ నేపథ్యంలో చిక్కుకున్న వలస కార్మికులు కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట బ్రిడ్జి క్రింద తలదాచుకున్న వారికి పవర్ స్వచ్ఛంద సంస్థ మరియు విశాఖ కెమిస్ట్స్ సొసైటీ వారు సంయుక్తంగా కార్మికులు విశాఖ నుంచి జలంధర్ వెళ్లుటకు రైలు ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు పవర్ సంస్థ కార్యదర్శి అబ్దుల్ రఖీబ్ గారు తెలిపారు. గురువారం విశాఖ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బగ్గాం శ్రీనివాసరావు గారు వలస కార్మికులకు రైలు రిజర్వేషన్ టికెట్లు , ప్రయాణికులకు అవసరమైన తినుబండారాలు, మాస్కులు, శానిటైజర్లు మరియు వారి స్వస్థలాలకు చేరుకున్న తర్వాత ఇబ్బందులు పడకుండా పదిరోజుల రేషన్ కాయగూరలు అందజేశారు. లాక్ డౌన్ సమయంలో షెల్టర్ హోమ్ లలో లేకుండా , ప్రయాణానికి సరిపడా డబ్బులు లేకుండా ఇంకా చాలా మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అటువంటి వారిని గుర్తించి వారికి ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా కెమిస్ట్స్ కోశాధికారి బెల్లాల సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో యు.వి.సిటీ కో ఆర్డినేటర్ రవి విక్రమ్, సావిత్రి , పెంచలయ్య , తదితరులు పాల్గొన్నారు. వలస కార్మికుల పిల్లల ప్రయాణానికి తగు జాగ్రత్తలు చెప్పామని ప్రతినిధి కిరణ్ కుమార్ తెలిపారు