విశాఖపట్నం వారధి న్యూస్ ,మే, 31: జిల్లాలో ఫేజ్డ్ రి-ఓపెనింగ్ వివరాలను జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ తెలియజేశారు. కంటైన్ మెంట్ జోన్స్త తప్పించి మిగతా అన్ని కార్యకలాపాలను కొనసాగించవచ్చునని తెలిపారు. జూన్ 8, 2020 నుండి కింద తెలిపిన కార్యక్రమాలను అనుమతించబడతాయి. > మత సంబంధ ప్రార్థనా స్థలాలు > హోటళ్లు, రెస్టారెంట్లు మరియు సేవారంగాలు (హాస్పిటాలిటీ సర్వీసులు) > షాపింగ్ మాల్స్ ( భౌతిక దూరం పాటిస్తూ, కోవిడ్-19 కట్టడికి నిబంధనలు పాటించాలి) > కర్ప్యూ రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు. అత్యవసరమైన సేవలు మినహా) > పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు, శిక్షణ/కోచింగ్ కేంద్రాలకు సంబంధించి ఇంకను ఆదేశాలు రావలసి ఉందన్నారు. అంత వరకు తెరువరాదన్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు , సినిమా హాళ్లు, వ్యాయామ శాలలు, పార్కులు, స్విమ్మింగ్ ఫూల్స్, బార్స్, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాళ్లు, మొదలైన వాటికి సంబంధించి ఆదేశాలు వచ్చు వరకు తెరువరాదన్నారు. కంటైన్ మెంటు జోన్స్ లో లాక్ డౌన్ జూన్ 30 వరకు ఉంటుందన్నారు. కంటైన్ మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలనే అనుమంతించాలి, అవి మినహాయించి ఇక్కడి ప్రజలు బయటకు రాకపోకలు సాగించడానికి వీల్లేదని చెప్పారు. > ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుండి వ్యక్తులు, గూడ్స్ రాకపోకలకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. > 65 సంవత్సరాలు దాటి, శారీరక రుగ్మతలు ఉన్నవారు, గర్భణీలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు అత్యవసర పనులకు తప్పించి బయటకు రాకూడదు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా లో లాక్ డౌన్ అమలు