విశాఖపట్నం జూన్ 03 వారధి న్యూస్ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకు బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డి సిసి మరియు డి ఎల్ ఆర్ సి మార్చి,& జూన్ 2020 సమావేశాన్ని చైర్మన్ హోదాలో వ్యవసాయం అనుబంధ రంగాలు, ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎం ఎస్ ఎం ఈ లు ,స్వయం సహాయక సంఘాల రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తదితరాల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా చేరాలంటే బ్యాంకుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తోందని అన్నారు. ప్రతి బ్యాంకు ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ను పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా అన్ని బ్యాంకులలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటం , మాస్కులు, శానిటైజర్ లను వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ఏజెన్సీ ప్రాంత మండలాలలో తప్పనిసరిగా బ్రాంచీల తో పాటు ఏటీఎంలను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో బాగా నష్టపోయిన వ్యవసాయ, ఎం ఎస్ ఎం ఈ రంగాలకు బ్యాంక్ లు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. వ్యవసాయ పనులకు సంబంధించి బోర్ల తవ్వకాలకు , వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రుణ సౌకర్యాలు కల్పించాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖ లైన ఉద్యాన ,పౌల్టీ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు,ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ప్యాకింగ్ లకు సంబంధించి రుణాలను అందించాలన్నారు. అతి పెద్ద తీర ప్రాంతం మత్స్యకార గ్రామాలు ఆక్వా రంగంపై ఆధారపడి ఉన్నాయని వారికి అవసరమైన ఋణాలను అందించాలన్నారు.