వర్సిటీ ఉద్యోగులకు మాస్క్లు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ ఏయూ జేఏసీ ఆద్వర్యంలో నిర్వహణ
విశాఖపట్నం జూన్ 03 వారధి న్యూస్ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగులకు మంగళవారం ఉదయం ఏయూ జేఏసీ ఆధ్వర్యంలో మాలు, శానిటైజర్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపయుక్తంగా మాు, శానిటైజర్లు పంపిణీ చేయడం మంచి పరిణామమన్నారు. ఉద్యోగులు కరోనా పట్ల అవగాహన, అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు. వైసీపీ నగర అద్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని వారి సంక్షేమానికి కృషిచేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా హెల్త్ కార్డులను అందించాలని నిర్ణయించారన్నారు. ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రిగా ఏడాది పరిపాలన పూర్తిచేసుకోవడం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం శుభ పరిణామమన్నారు. ఏయూజేఏసీ చైర్మన్ ఆచార్య జాలాది రవి మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగులు కరోనా పట్ల అవగాహనతో జాగరూకులై ఉండాలని సూచించారు. జేఏసి అద్యక్షులు డాక్టర్ గుంటుబోయిన రవికుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఉ ద్యోగులకు హెల్త్ కార్డులను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. దీనికి ఉద్యోగులంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి కె. అప్పారావు, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.