విశాఖపట్నం వారధి న్యూస్ జూన్ 02 ఎన్నో చారిత్రిక నిర్ణయాలతో మోడీ పాలనసాగుతోందోదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు విశాఖపట్నం బీజేపీ మంగళవారం ఉదయం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు దేశభద్రతకోసం రాజీలేని రీతిలో పాలన అందిస్తున్నామన్నారు రాష్ట్రానికి 14 ఫైనాన్స్ కమిషన్ డబ్బులు నేరుగా ఇచ్చరని తెలిపారు ప్రతి వారంతంలో వర్చువల్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు 17 వర్గాల వారితో సభలు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు వాట్సాప్ బూత్ గ్రూప్ లను ఏర్పాటు చేయనున్నట్లు మాధవ్ తెలిపారు జూన్ 22న ప్రజాస్వామ్య పునరుద్దరణ దినోత్సగా నిర్వహిస్తామన్నారు
అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుమాట్లాడుతూ మాధవధార లో13/3 సర్వే నెంబర్ లో సుమారు రెండు ఎకరాల భూమి కబ్జాలకు గురుఅయిందన్నారు మంత్రులు,ఎంపీ కి చిత్తశుద్ధి ఉంటే ఆ భూమి పై దృష్టిసారించాలని కోరారు బీజేపీ పార్టీ ఎవరికి అయిన అన్యాయం జరిగితే స్పందిస్తుందన్నారు వలంటీర్ల కు 5000 వేలు జీతం ఇవ్వడం దారుణమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లకు కనిషం పది వేల జీతం ఇవ్వాలని ప్రభుత్యానికి విజ్ఞప్తి చేశారు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు .మద్యం లో కొత్త బ్రాండ్లు వస్తున్నాయిని చమత్కరించారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నగర శాఖా అధ్యక్షులు రవేంద్ర,సుహాసినిలు పాల్గొన్నారు