కరోనా కేసులు నెలకొన్న కంటయన్ మెంట్ జోన్లపై తగు ధృష్టి సారించాలి జి.వి.యం.సి. కమీషనర్ డా. జి. సృజన

కరోనా కేసులు నెలకొన్న కంటయన్ మెంట్ జోన్లపై తగు ధృష్టి సారించాలి జి.వి.యం.సి. కమీషనర్ డా. జి. సృజన


విశాఖపట్నం , జూన్ -4:- జి.వి.యం.సి. పరిధిలో వివిధ ప్రాంతాలలో కరోనా వ్యాధి ప్రబలి ఉండడం చేత, ఆయా ప్రాంతాలలో 200 మీ పరిదివరకు కంటయన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి, జనసంచారం నియంత్రణ చేయబడుతున్నది. కంటయన్ మెంట్ ప్రాంతాలలో షాపులు, వాహన రాకపోకల నియంత్రణ ప్రభుత్వం జారీచేసిన ప్రోటోకాల్ నిభందనలకు అనుగుణంగా చేపట్టాలని, అప్పుడే వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి జరగకుండా నియంత్రించ వచ్చునని కమీషనర్ వివరించారు. జి.వి.యం.సి, ప్రధానకార్యాలయపు సమావేశ మందిరంలో అధనపు కమీషనర్, కంటయన్ మెంట్ కమిటీ సభ్యులు, ఆయుష్ వైద్యులు, జోనల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించారు. కమీషనర్ కంటయన్ మెంట్ జోన్లలో ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు అక్కడ ప్రజలు ముఖ్యంగా మురికివాడ ప్రాంతాలలో చాలా సులభంగా సంచరించడం, షాపులు తెరవడం, మార్క్లు కూడా ధరించకపోవడం వంటివి గమనించారని, ఇటువంటివి పునరావృతం కాకుండా, పకడ్బందీగా జనసంచార నిషేధం కంటయన్ మెంట్ జోన్లలో చేయాలని, కంటయన్ మెంట్ జోన్ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. షాపులు, వాహన రాకపోకలు , ఇతర ప్రాంతాలనుండి ప్రజా సంచార నిషేధం మొ,, వాటిని పోలీస్ అధికారులతో కలసి చాలా ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. వార్డు అడ్మిన్ కార్యదర్శి కంటయన్ మెంట్ జోన్లలో చేపట్టిన సర్వేలేన్స్ రిపోర్ట్, జోనల్ కమీషనర్ ద్వారా కమీషనర్ కు ప్రతీరోజు సమర్పించాలన్నారు. కంటయన్ మెంట్ జోన్ ప్రాంతం డీ-నోటిఫై అయ్యేవరకు సర్వే నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యావసరాలు, మందులుకాని అవసరమైతే వాటిని స్వయంగా వారి ఇండ్లకు చేర్చుటకు గాను తగు చర్యలు తీసుకోవాలన్నారు. జోనల్ కమీషనర్లు, కంటయన్ మెంట్ కమిటీ బృందం, కంటయన్ మెంట్ ప్రత్యేకాదికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకొని విధులు నిర్వర్తించాలన్నారు. కరోనా వైరస్ నిరంతరం వ్యాప్తి చెందుతున్నందువలన ప్రతీ అదికారి విధులు తగు జాగురూకతతో నిర్వర్తించాలని ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించిననూ, దాని మూల్యం ఎక్కువగా ఉండగలదని అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కమీషనర్ సోమన్నారాయణ, సి.యం.ఒ. హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి, శాస్త్రి, కంటయన్ మెంట్ కమిటీ సభ్యులు, ఆయుష్ డాక్టర్లు, జోనల్ కమీషనర్లు, వార్డు పాలనా కార్యదర్శులు, కంటయన్ మెంట్ జోన్ ప్రత్యేకాధీకారులు తదితర అధికారులు పాల్గొన్నారు.