విశాఖపట్నం (వారధి న్యూస్ జూన్ 02) ఈ నెల 8 నుంచి కోవిడ్ నిబంధనలు సడలించి పర్యాటకానికి సంబంధించి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతొడని . మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు నగరములో ప్రభుత్య అథిది గృహంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మంత్రి మాట్లాడుతూ టూరిజం ,ప్రైవేట్ హోటలకు కు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు ముందుగా వినియోగదారులు ఆన్ లైన్ లో వీటిని బుక్ చేసుకోవాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా హోటల్ పునః ప్రారంభానికి కొన్ని నిబంధనలు , నియమాలు పై త్యరలో విజయవాడ లో వివిధ హోటల్ సంఘాలతో చర్చలు జరుపుతామన్నారు గత ఏడాది కాలంలో 13 జిల్లాలో అనేక సాంస్కృతిక పర్యాటక వేడుకలు నిర్వహించామని తెలిపారు పర్యటకశాఖ వివిధ దేశాల పర్యటక వేడుకలో పాల్గొన్నామన్నారు పురాతన వస్తు పరిరక్షణ శాఖ తరుపున విజయవాడ బాపు మ్యూజియం మరిన్ని హంగులు ఏర్పాటు చేశామన్నారు యువజన సర్వీసులు తరుపున వివిధ దేశాల్లో జరిగే యువజనోత్సవానికి మన రాష్ట్రం నుంచి యువతి యువకులను పంపించినట్లు చెప్పారు
పెనుగొండ, ఏచ్చెర్ల, మాచర్ల, పాయకరవు పేట లలో నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు ముత్తం శెట్టి శ్రీనివాసరావు.తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బ తినకుండా పర్యాటక శాఖ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు పర్యాటక శాఖ నుంచి అల్లూరి సీతా రామరాజు పుట్టిన పాండ్రంగిలో ఒక మ్యూజియం నిర్మిస్తామన్నారు లంబసింగీ లో 3 స్టార్ హోటల్ పనులు వేగంగా జరుగుతున్నాయి మంత్రి తెలిపారు ..టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు .550 మంది పర్యాటక శాఖ హోటల్స్ లో పనిచేస్తున్నట్లు మంత్రి అవంతి పేర్కొన్నారు కోవిడ్ నిబంధన సడలించాక మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతామన్నారు
రాష్ట్ర వ్యాప్తంగా బోట్ ప్రయాణికుల రక్షణ కోసం 9 చోట్ల చెక్ పోస్టులు పెడుతున్నట్లు తెలిపారు ఐతే .పర్యాటక శాఖ ఒక యాప్ ను తయారు చేసిందని ఆ యాప్ ను . త్వరలోనే సీఎం చేతులు మీదుగా ప్రారంభిస్తామని మంత్రి అవంతి తెలిపారు ...
అనంతరం పర్యాటక శాఖ, స్పోర్ట్స్, సాంస్కృతిక శాఖలు ఏడాదిలో సాధించిన అభివృద్ధి ప్రణాళికలనను మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు వివరించారు