విశాఖ విమ్స్ ఆసుపత్రిలో మంత్రి అవంతి శ్రీనివాసరావును రోగుల బంధువులు అడ్డుకున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న తమ తండ్రి చనిపోయిన విషయాన్ని చెప్పలేదంటూ... బాధిత కుటుంబసభ్యులు అవంతిని నిలదీశారు. మరణవార్త దాచిపెట్టి ఖననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేవంటూ మరికొందరు అవంతిని అడ్డగించారు.అనంతరం అవంతి మీడియాతో మట్లాడుతుండగా ఓ మహిళ అడ్డుకుంది. తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని వాపోయారు. విమ్స్ ఆస్పత్రి వైద్యులపై కేసు పెడతానంటూ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు
విశాఖ షిప్ యార్డ్ ప్రమాదంపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ లో క్రేన్ ప్రమాదంలో 10 మంది మరణించారని, ఈ ప్రమాదంపై సుప్రింకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని , భవిష్యతులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు
కరోనా వ్యాధి నియంత్రణ, నివారణ కొరకు విశాఖలో 35 వార్డ్ లో చైతన్యం తెచ్చేందుకు వి ఎం ఆర్. ఫౌండేషన్ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ నడుము బిగించారు ఆటోల ద్వారా కరోనా వ్యాధి నియమనిబంధనల క్యాంపెయిన్ ర్యాలీని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విల్లూరు భాస్కర్, పరమేష్ వార్డు నాయకులు ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్స్ పాల్గొన్నారు.
విశాఖ ఏవీఎన్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రేమ సమాజం లెప్రసీ సేవా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు విశాఖలో సోమవారం ఉదయం ఘనంగా జరిగాయి. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న వారికి స్వామి వివేకానంద సంస్థ మహిళా సభ్యులు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి, వారి నుంచి ఆశీస్సులు పొందారు. వారందరికీ పండ్లు,మిఠాయిలు, తినుబండారాలు పంపిణీ చేశారు.ఈ వేడుకల్లో సంస్థ కార్యవర్గ సభ్యులు, డి.ఎస్.అగర్వాల్, అధ్యక్షుడు సూరాడ అప్పారావు, సభ్యులు పోలవరపు అప్పలకొండ, వాసుపల్లి ఉమాదేవి, భవాని, రాణి, రత్న, వెంకటి, సావిత్రి, అచ్యుత, రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
మాతృభాష తెలుగు మనుగడ కోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు
పరవస్తు ఫణిశయన సూరి పిలుపునిచ్చారు విశాఖ మద్దిలపాలెంలో తెలుగుతల్లి విగ్రహం దగ్గర తెలుగు దండు ఆధ్వర్యంలో “ తెలుగు తల్లీ ఊపిరి పీల్చుకో " అనే నినాదంతో ఈ ఉద్యమనికి శ్రీకారం చుట్టారు ప్రజలందరూ పాల్గోవలన్నారు ఈ కార్యక్రమంలో పరవస్తు పద్యపీఠం, తెలుగుదండు సభ్యులు శివ జ్యోతి, హేమ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలు ప్రాంతాల్లో మహిళలు రాఖీలు కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలోని వేమన మందిరం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలు గొల్లగాని లక్ష్మీ తన కుటుంబంతో కలిసి వైఎస్ విగ్రహానికి రాఖీ కట్టారు. ప్రతియేటా వైఎస్సార్ విగ్రహానికి రాఖీ కట్టడం ఆనవాయితీగా ఆమె కొనసాగిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచంలో ఎందరికో అన్నగా ఇప్పటికీ సజీవంగా ఉన్నారని ఈ సందర్భంగా లక్ష్మీ పేర్కొన్నారు.