ఐదుగురు యువకుల జాడ తెలిసింది చైనా వద్దే ఉన్నారని ప్రకటించింది
అరుణాచల్ ప్రదేశ్‌లో అదృశ్యమైన ఐదుగురు యువకుల జాడ ఎట్టకేలకు తెలిసింది. వారిని చైనా అపహరించిందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపైఎట్టకేలకు స్పందించింది. ఆ ఐదుగురు వేటగాళ్లు తమ వద్దే ఉన్నారని ప్రకటించింది. అప్పర్ సుబాన్‌సిరి జిల్లా నాచో ప్రాంతం నుంచి సరిహద్దులోని అడవుల్లో వేటకు వెళ్లిన ఐదుగురిని గురువారం మెక్‌మెహన్ రేఖ వద్ద చైనా సైన్యం అపహరించిందని, అక్కడి నుంచి తప్పించుకు వచ్చిన ఇద్దరు యువకులు తెలిపారు. వారి సమాచారాన్ని తెలియజేసేందుకు చైనా సైన్యం నిరాకరించింది.
అయితే, తాజాగా వారి విషయంలో చైనా ప్రకటన చేసింది. ఆ ఐదుగురు తమ వద్దే ఉన్నారని అంగీకరించింది. వారు తమ భూభాగంలో కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో హాట్‌లైన్ ద్వారా భారత సైనికులకు సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి కిరణ్ రిజుజు ట్విట్టర్ ద్వారా తెలిపారు.